Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏదో జరుగుతుంది : నారా లోకేశ్

nara lokesh
, శుక్రవారం, 13 అక్టోబరు 2023 (10:47 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం జాతీయ మీడియాతో మాట్లాడారు. స్కిల్ కేసు, అమిత్ షాతో భేటీ, తదితర అంశాలపై స్పందించారు. స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోందని అనుమానం వెలిబుచ్చారు. 
 
తన తల్లి నారా భువనేశ్వరి టీ రిటర్నులు సీఐడీ చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తన తల్లి ఐటీ రిటర్నుల విషయంలో సీబీడీటీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్‌లోనే అనుమానం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. 
 
గత 10 రోజులుగా కేసు విషయమై వైసీపీ మాట్లాడడంలేదని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశానని తెలిపారు. ఇక చంద్రబాబు అంశంలో తాము 17ఏ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశామని అన్నారు. 17ఏ పరిగణనలోకి తీసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నారు.
 
అమిత్ షాతో భేటీపైనా లోకేశ్ వివరణ ఇచ్చారు. అమిత్ షాకు అన్ని వివరాలు తెలియజేసినట్టు వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పానని, చంద్రబాబు భద్రత పరంగా ఉన్న ఆందోళనను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని వివరించారు.
 
'సీఐడీ ఎందుకు పిలిచింది... ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. పూర్తిగా రాజకీయ కక్షతోనే పెట్టిన కేసులు అని ఆయనకు చెప్పాను. ఇదంతా బీజేపీనే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నారని అమిత్ షాతో చెప్పాను. బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని అమిత్ షా స్పష్టంగా చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కిల్ డెవలప్‌మెంట్ క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు...