Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి పీల్చుకున్న ఏపీ సీఎం జగన్.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్‍‌‌ను రద్దు చేయాలంటూ వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో సీఎం జగన్ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు గత జూలై నెలలోనే ముగిశాయి. అయితే తీర్పును అప్పటి నుంచి కోర్టు రిజర్వు చేసింది. తాజాగా బుధవారం తీర్పు వెల్లడించింది.
 
అక్రమాస్తుల కేసులో భాగంగా ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్‌ బెయిల్‌ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్‌ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. 
 
బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్‌ వివిధ కారణాలతో, కోర్టుకు గైహాజరవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు పిటిషన్ను కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments