ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్. జగన్ ఆధ్వర్యంలో సినిమా టికెట్లు ఇకపై ఆన్‌లైన్ ప్రకియ ద్వారానే వుంటాయని తేల్చిచెప్పారు. దీనిపై పలువురు సినీ ప్రముఖ/లఉ పలురకాలుగా స్పందించారు. కానీ, ఇండస్ట్రీ పెద్దలు మాత్రం నోరు. మెదపలేదు. ఇక ఈ విషయమై మంగళవారంనాడు మంత్రి పేర్ని ఓ బాంబ్ పేల్చారు. దానివెనుక సీక్రెట్ వివరించారు. అసలు సినిమా టికెట్ల ఆన్‌లైన్ పద్ధతి కావాలనే సినీ ప్రముఖులే కోరారని స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఇది తెలుసుకోకుండా కొందరు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలోనే సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని, పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి, ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, టిక్కెట్ రేట్లను, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన జీవో ఇచ్చాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే టిక్కెట్ల విక్రయం జరిపేలా ఆదేశాలిచ్చామన్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కనుక. దీనిపై అర్ధం లేని విధంగా పెద్ద ఎత్తున కొందరు విమర్శలు చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేసే ప్రయత్నం చేయొద్దన్నారు.
2002 ఏడాదిలోనే ఈ ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లను అమ్మించే ప్రయత్నం చేయండని కేందాన్ని కోరాం. పన్నుల ఎగవేత అరికట్టొచ్చని గతంలో ప్రభుత్వాలు భావించాయి. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్లను అమ్మొచ్చని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సమ్మతి తెలుపుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అంగీకారం తెలిపింది. ఎవరికో మేలు చేయడానికి విమర్శలు చేయడం సరికాదు. ప్రభుత్వ ఆలోచనను అర్ధం చేసుకోవాలని మంత్రి కోరారు. కనుక ఇకపై వైఎస్. జగన్ ప్రభుత్వంపై దుమ్మువేయరాదని సూచించారు. సో. సినీ పెద్దలు దీనిపై నోరు మెదపాల్సివుంది.