అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా- 22 ప్రముఖ కంపెనీలు, వేయి ఉద్యోగాలు

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:04 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వేదికగా మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఐ.టీ, పరిశ్రమలు,  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. కరోనా సంక్షోభం అనంతరం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నిరుద్యోగులకు, యువతకు ఇది సువర్ణావకాశం. జాబ్ మేళా ద్వారా హీరో, ఇసుజు, అమర రాజా బ్యాటరీస్, బజాజ్, హ్యుందయ్, అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో, మెడికవర్,హెటెరో ఫార్మా వంటి పేరున్న కంపెనీలలో ఉద్యోగాలు పొందే ఛాన్స్ వ‌చ్చింద‌న్నారు. 
 
ఐ.టీ, పరిశ్రమలు,  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  నేతృత్వంలో  మరో వారం రోజుల్లో  ఈ మెగా జాబ్ మేళా జరగనుంది. అక్టోబర్ 30 శనివారం మంత్రి మేకపాటి ముఖ్య అతిథిగా ఈ ఉద్యోగ మేళా ప్రారంభం కానుంది. మంత్రి మేకపాటి సొంత నియోజకవర్గం ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగే మరో భారీ జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే యువతకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆహ్వానం పలుకుతోంది. 22  పేరున్న కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొని అర్హులైన 1,040 మంది యువతీ యువకులకు అందించనున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేకపాటి పిలుపునిచ్చారు. 
 
కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారు, కొత్తగా కొలువు కోరుకొనే ఆత్మకూరు నియోజకవర్గ యువతీ యువకులు, నెల్లూరు జిల్లా నిరుద్యోగులూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు హీరో, ఇసుజు, అమరరాజా, బజాజ్,హ్యుందయ్,అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో, , మెడికవర్,హెటెరో ఫార్మా వంటివి పాల్గొంటున్నాయి. మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు www.apssdc.in ద్వారా తమ వివరాలు ముందుగానే నమోదు చేసుకోవాలి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బిటెక్, డిప్లమా ఇన్ మెడికల్, ఫార్మసీ, బీఎస్సీ కెమిస్ట్రీ విద్యనభ్యసించిన వారందరూ ఈ మేళాలో పాల్గొనవచ్చు. అభ్యర్థుల వివరాలతో కూడిన సీవీ, రెజ్యుమ్ లతో పాటు విద్యార్హతలకు సంబంధించిన ధవపత్రాలు. ఆధార్ కూడా తప్పని సరి ఉండాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments