Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ - కార‌ణం ఇదే!

Advertiesment
Megastar Chiranjeevi
, సోమవారం, 18 అక్టోబరు 2021 (09:54 IST)
Chiru surgery hand
కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో  చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 
 
ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ లా ఉండడం అభిమానులందరినీ కలవరపెట్టింది. ఏమైంది అని అభిమానులు చిరంజీవిని ప్రశ్నించగా చిరంజీవి అసలు విషయం చెప్పారు. తన అరచేతికి చిన్నపాటి సర్జరీ అయింది అనే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో డాక్టర్ ను సంప్రదించానని వెల్లడించారు. 
 
అయితే కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్(median nerve) అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్(carpal tunnel syndrome) అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని, 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ సర్జరీ జరిగిన పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యధావిధిగా పని చేస్తుందని, దర్శకుడు విజయబాపినీడు అల్లుడయిన సుధాకర్ రెడ్డి తనకు ఎంతో కాలంగా పరిచయం ఉండడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సర్జరీ పూర్తి చేసినట్లు చిరంజీవి వెల్లడించారు. ఈ సర్జరీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ ఇచ్చానని చిరు వెల్లడించారు. చేయాల్సిన ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసి ఈ 15 రోజులు గ్యాప్ తీసుకుంటున్నాని, నవంబర్ ఒకటో తారీకు నుంచి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. 
 
- మీరు ఇంతలా కష్టపడుతూ, మీ బాడీని కష్టపెడుతున్నారు కాబట్టి ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయి అని ఇక మీదట కుడి చేతికి ఎలాంటి ఇబ్బంది లేదని సుధాకర్ రెడ్డి వెల్లడించినట్టు మెగాస్టార్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి అంతా సెట్ అయింది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని మెగాస్టార్ అభిమానులతో పేర్కొన్నారు. మెగాస్టార్  చేతికి సర్జరీ అనే మాట వినగానే అభిమానులు తొలుత కంగారు పడినా, ఇప్పుడు అంతా బాగానే ఉందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండస్ట్రీలో ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు: మోహన్ బాబు