నా కడుపులో మంట నా గురువు గారిచ్చిన హోమియో మందుతో పోయిందిః చిరంజీవి
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (20:06 IST)
నేను పుట్టింది రాజమండ్రిలోనే.. నా మొదటి మూడు సినిమాలు రాజమండ్రి ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయని` మెగాస్టార్ చిరంజీవి గుర్తుచేసుకున్నారు. అక్టోబర్ 1న శుక్రవారం అల్లు రామలింగయ్యగారి 99వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొన్నారు.
Allu aravind- fater statue
రాజమండ్రి హోమియోపతి మెడికల్ కళాశాలలో అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ చేశారు. : తెలుగు నవ్వుల రేడు అల్లు రామలింగయ్య జయంతి సంధర్భంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అనేక కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాజమండ్రి హోమియోపతి మెడికల్ కళాశాలలో అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ జరిగింది.
Allu Ramalingaiah Statue
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, నాది అల్లు రామలింగయ్యగారిది గురు – శిష్యుల సంబంధం. షూటింగ్ బిజీలో వుండి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చేది. దాని కోసం ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదు. కానీ అల్లు రామలింగయ్య గారు ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి తీసినట్లు పోయింది. ఇవాళ్టికీ మా ఫ్యామిలీ అంతా హోమియోపతి మందులే వాడతామన్నాం. ఆయన హోమియోపతిలో తగ్గని జబ్బు లేదు. రాజ్యసభ ఎం.పి.గా ఉండటం వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వగలిగానని సంజీవని లాంటి హోమియోపతి వైద్యం చిరంజీవిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. హోమియోపతి సైడ్ ఎఫక్ట్స్ లేని వైద్యం అని, హోమియోపతి వైద్యానికి మరింత ప్రాచుర్యం రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, మురళీమోహన్, రాజమండ్రి హోమియోపతి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
తర్వాతి కథనం