Perni nani with cine celebrates
ఆదివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ సినీ పరిశ్రమ సంక్షోభంలో వుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారంనాడు చిరంజీవితోపాటు పలువురు ఎగ్జిబిటర్లు, పంపిణీదరులు కూడా మంత్రి పేర్ని నానితో విజయవాడలోని కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై చర్చించాం. ఆన్ లైన్ పద్దతిలో సినిమా టిక్కెట్లు అమ్మే ప్రక్రియకు అందరూ అంగీకారం తెలిపారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం అమలుపై తాము కూడా ఇన్ పుట్స్ ఇచ్చి సహకరిస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే సినిమా టిక్కెట్లు అమ్మే విషయానికి కూడా ఆమోదం తెలిపింది మంత్రి తెలిపారు.
కాగా, ఈ చర్చలోని విషయాలను సి.ఎం దృష్టికి తీసుకెళ్లి తదుపరి అంశాలను వివరిస్తామన్నారు. సినీ పరిశ్రమలోని చిన్న నిర్మాతల సమస్యలుకూడా చర్చకు వచ్చాయి. వాటిపై మరోసారి చర్చించే పనిలో వున్నట్లు తెలుస్తోంది. అందరూ పెద్ద నిర్మాతలు, హీరోలు, పంపిణీదారులే హాజరయ్యారు. గతంలో వై.ఎస్. హయాంలో అటు పెద్ద వారిని, ఇటు చిన్న వారిని వేరువేరుగా పిలిచి సినీ సమస్యల గురించి చర్చించారు. ఆ తర్వాత వచ్చిన సి.ఎం.లు ఈ విషయంలో శ్రద్ధ చూపలేదు. ముఖ్యంగా చిన్న సినిమాల వారికి రాయితీలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. దానిపై త్వరలో స్పందిస్తామని పేర్నినాని తెలియజేశారు.