Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్‌ను అడిగి మ‌రీ డాన్స్ వేయించిన సాయిప‌ల్ల‌వి

Advertiesment
మెగాస్టార్‌ను అడిగి మ‌రీ డాన్స్ వేయించిన సాయిప‌ల్ల‌వి
, సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:36 IST)
Sai pallavi-chiru
సాయిప‌ల్ల‌వికి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎనలేని ఇష్టం. చిరంజీవి గారి సినిమాల్లో డాన్సులు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. ఆయన నా డాన్సింగ్ టాలెంట్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉందనీ, చిరంజీవి త‌న‌ను ప్ర‌శంసిస్తుంటే చెప్ప‌లేని ఆనందంగా వుంద‌ని తెలియ‌జేసింది. అందుకే మెగాస్టార్ ల‌వ్‌స్టోరీ ఫంక్ష‌న్‌లో స్పీచ్ ఇచ్చిన అనంతరం స్టేజీ దిగుతుంటే సాయిప‌ల్ల‌వి త‌న‌తో డాన్స్‌వేయ‌మ‌ని ప‌ట్టుబ‌ట్టింది. కానీ చిరు లైట్‌గా తీసుకోమ్మా అంటూ సున్నితంగా చెప్పినా ఆమె విన‌లేదు.
 
దీనికితోడు యాంక‌ర్ సుమ కూడా వేయ‌మ‌ని అడిగింది. అయినా మొహ‌మాటంగా చిరు వెళ్ల‌బోతుంటే, సాయిప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీలోని `సారంగ‌ద‌రియా` పాట‌కు డాన్స్ వేసింది. ఆమెను డాన్స్‌ను చూస్తూ ఎంజాయ్ చేశాక‌, ఇక చాల్లేమా.. అంటూ చిరు అన్నా సాయిప‌ల్ల‌వి వినిపించుకోలేదు. వెంట‌నే మెగాస్టార్ సినిమాలో పాట వేయ‌మ‌ని అక్క‌డి డీజె టీమ్‌ను అడ‌గ‌డంతో, వారు `అమ్మ‌డు లెట్స్ కుమ్ముడు..అంటూ పాట వేశారు.

దానికి సాయిప‌ల్ల‌వి డాన్స్ వేయ‌డంతో ఆమె డాన్స్‌కు ముగ్థుడైన చిరంజీవి రెండు స్టెప్‌లు వేశారు. ఆయ‌న్ను అనుక‌రిస్తూ సాయిప‌ల్ల‌వి డాన్స్ వేయ‌డం అందిరీనీ అల‌రించింది. ఇది త‌న జీవితంలో మ‌ర్చిపోలేని రోజుని సాయిప‌ల్ల‌వి ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. ఒక‌వైపు అమీర్‌ఖాన్‌, మ‌రోవైపు చిరంజీవి ఇద్ద‌రూ రావ‌డం జీవితంలోని మ‌ధురానిభూతిగా పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సినిమా నా హ్యాపీడేస్ కు రిలేటివ్ గా అనిపించిందిః శేఖర్ కమ్ముల