Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సి.సి.టివి ఫుటేజ్‌ను హ్యాపీగా చూసుకోండి, మెగా ఫ్యామిలీతో విభేదాలేవు: మంచు విష్ణు

Advertiesment
సి.సి.టివి ఫుటేజ్‌ను హ్యాపీగా చూసుకోండి, మెగా ఫ్యామిలీతో విభేదాలేవు: మంచు విష్ణు
, సోమవారం, 18 అక్టోబరు 2021 (13:09 IST)
మా ఎన్నికల సి.సి. ఫుటేజ్‌ను తీసుకెళ్లినా ఉపయోగం ఏముందని ప్రశ్నించారు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. సీసీ టీవీ ఫుటేజ్‌ను హ్యాపీగా చూసుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యబద్దంగానే ఎన్నికల్లో గెలిచామని.. గెలుపు ఓటములు పక్కనబెట్టి తమ అసోసియేషన్‌కు సహకరించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేయవచ్చన్నారు మంచు విష్ణు.

 
సీనియర్ నటుల సలహాలతో బైలాస్‌ను మారుస్తానని స్పష్టం చేశారు. మెగా ఫ్యామిలీతో ఎలాంటి విభేదాలు లేవని.. పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మా ఎన్నికల తరువాత చిరంజీవితో తన తండ్రి ఫోన్ చేసి మాట్లాడారని.. అయితే ఏం మాట్లాడారన్న విషయం తన తండ్రినే అడగాలన్నారు. 

 
నిన్న జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో తాను స్టేజి కింద మాట్లాడినట్టు విష్ణు చెప్పుకొచ్చారు. స్టేజి మీద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉండటంతో తాము మాట్లాడుకో లేదని.. అయితే దీన్ని మీడియా వక్రీకరించిందన్నారు మంచు విష్ణు.

 
ఆన్‌లైన్ సినిమా టికెట్స్ విధానాన్ని ఒక నిర్మాతగా సమర్ధిస్తున్నానని విష్ణు చెప్పారు. త్వరలో సినిమా టికెట్ల రేట్లను పెంచాలని ముఖ్యమంత్రిని కలిస్తానన్నారు. ఏపీలోను మా అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకుల తర్వాత సమంతకు ఆఫర్లే ఆఫర్లు.. నయనతారను ఫాలో అవుతున్న శామ్!