Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

మంచు విష్ణు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? ఎందుకు..?

Advertiesment
Manchu Vishnu
, శనివారం, 16 అక్టోబరు 2021 (16:40 IST)
మా అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా సభ్యుల మధ్య మాత్రం మాటల యుద్థం కొనసాగుతోంది. ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేసింది మెగాస్టార్ ఫ్యామిలీ. మరోవైపు బాలక్రిష్ణ అండతో పోటీలో నిలిచారు మంచు విష్ణు. అందులో మంచు విష్ణు గెలిచారు. ఇదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు మెగాస్టార్ కుటుంబం పైనే సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

 
తన ప్రమాణ స్వీకారోత్సవానికి బాలక్రిష్ణ, కోట శ్రీనివాసులను ఇంటికెళ్ళి ఆహ్వానించిన మంచు విష్ణు మెగాస్టార్ కుటుంబాన్ని మర్చిపోయారు. చిరంజీవిని గానీ, పవన్ కళ్యాణ్‌ను గానీ పిలవలేదు. దీంతో మెగా అభిమానులు మండిపడుతున్నారు.

 
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం. అంతమాత్రాన సినిమాల్లో అగ్రనటులుగా ఉన్న మెగా ఫ్యామిలీని పిలవకుండా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారు మెగా అభిమానులు. 

 
విష్ణు తీరు బ్రిటీష్ విధానాల్ని తలపిస్తోందని ప్రకాష్ రాజ్ ప్యానల్ లోని సభ్యులు చెబుతున్నారట. ఇదిలావుంటే మంచు విష్ణు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారట. మా అంటే ఒక్కరిది కాదు అందరిదీ.

 
సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరూ సభ్యులే. 900 మందిలో మంచు విష్ణును గెలిపించిన సభ్యులు ఎంతమంది ఉంటారో, ప్రకాష్ రాజ్‌కు ఓటేసిన సభ్యులు అదే స్థాయిలో ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. తక్కువ ఓట్లతోనే ప్రకాష్ రాజ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. 

 
సభ్యుల మధ్య వైరం కాస్త ఇలాగే కొనసాగి ఏస్థాయికి చేరుతుందోనంటున్నారు సినీ విశ్లేషకులు. ఎవరో ఒకరు సర్దుకుపోవాలే తప్ప ఇలా ఒకరిపై ఒకరు ఇంకా ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్సలు, ప్రతి విమర్సలు చేసుకుంటూ  పోతే ఉపయోగం ఉండదంటున్నారు. మరి చూడాలి మా అసోసియేషన్ సినిమాకు శుభం కార్డు పడుతుందా లేదా అన్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరం కలిసి మెలిసి ఉందాం.. కలిసికట్టుగా పని చేసుకుందాం : మోహన్ బాబు