Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృతకు ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు... మారుతీ రావు వీలునామా?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (11:32 IST)
మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రియల్టర్ మారుతీ రావు ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఆర్యవైశ్య సత్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఆత్మహత్య కేసులో మారుతీ రావు రాసిన వీలునామా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వీటిని ప్రణయ్ హత్య కేసు విచారణ సమయంలో కోర్టుకు సమర్పించనున్నారు. అలాగే, ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మరణించడంతో, అతని పేరును తొలగించి, మిగతా వారిపై విచారణ కొనసాగించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించనున్నారు.
 
అయితే, వీలునామా పత్రాల్లో తన కుమార్తె పేరు మీద ఒక్క పైసా కూడా మారుతీ రావు రాయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. తానెంతగానో ప్రేమతో చూసుకున్న కుమార్తె, ఇక తన వద్దకు రాదని భావించిన మారుతీరావు కొంతకాలం క్రితమే తన వీలునామాను మార్చి రాశారు. 
 
తన యావదాస్తిలో సగం తమ్ముడు శ్రవణ్ పేరిట, మిగతాది భార్య గిరిజ పేరిట రాసిన ఆయన, దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. వీటి కాపీలు ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నాయి. కుమార్తె అమృత పేరిట ఆయన ఒక్క పైసా కూడా రాయలేదు. 
 
గతంలో అమృత భర్త ప్రణయ్ హత్య తర్వాత, తన ఆస్తిలో అధిక భాగాన్ని మారుతీ రావు కుమార్తె పేరిటే రాశారన్న సంగతి తెలిసిందే. ఆపై జరిగిన పరిణామాలు ఆయన తన వీలునామాను మార్చుకునేలా చేశాయని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments