Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కులం పిచ్చితో ఓ కుటుంబం చిన్నాభిన్నం : నటి మాధవీలత

Advertiesment
Maruthi Rao Suicide
, సోమవారం, 9 మార్చి 2020 (14:39 IST)
మిర్యాలగూడకు చెందిన మారుతీ రావు ఆత్మహత్యపై తెలుగు సినీ నటి మాధవీలత స్పందించారు. బంగారం లాంటి కూతురు.. అల్లుడు, పండంటి మనుమడితో అందమైన జీవితాన్ని గడపకుండా కులమే అడ్డుగోడలు సృష్టించిందంటూ ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
'కూతురిని జీవితకాలపు విషాదంలోకి నెట్టివేసిందీ.. తన భార్యను శోకంలో ముంచిందీ.. ఈయన జీవితాన్ని నేరమయం చేసి.. శిక్ష పడక ముందే కుల సంఘం సత్రంలోనే చివరకి హరించిందీ.. పాపం ప్రేమించిన నేరానికి హత్యతో శిక్షించిందీ.. ఆ హత్య తప్పుకాదు అని మాట్లాడే దుర్మార్గులను సృష్టించిందీ కులమే.. ఇంకేమీ కాదు... కులమే' అని ఆమె పేర్కొన్నారు. ఆమె ఫేస్‌బుక్ పోస్ట్ యధావిధిగా...
 
"బంగారంలాంటి కూతురూ, ప్రేమకూ, ఆదరానికీ యోగ్యుడైన అల్లుడూ, పండంటి మనుమడితో, అందమైన జీవితాన్ని గడపకుండా ఆపిందీ, కూతురును జీవితకాలపు విషాదంలోకి నెట్టివేసిందీ, తన భార్యను శోకంలో ముంచిందీ, ఈయన జీవితాన్ని నేరమయం చేసి, శిక్ష పడక ముందే కుల సంఘం సత్రంలొనే చివరకి హరించిందీ, పాపం ప్రేమించిన నేరానికి హత్యతో శిక్షించిందీ, ఆ హత్య తప్పుకాదు అని మాట్లాడే దుర్మార్గులను సృష్టించిందీ కులమే. ఇంకేమీ కాదు. కులమే.
 
ఆ కుటుంబాన్ని ఎలా ఛిద్రం చేసిందో, మనుషుల మధ్య ప్రేమలనూ, సమాజాన్నీ, దేశాన్నీ అంతే చేసిందీ, చేస్తున్నదీ. 
 
ఈ రాక్షసి మళ్లీ దేశాన్ని కబళించడానికి తల ఎత్తుతున్నదీ. రాజకీయంలో భాగమౌతున్నదీ ప్రధాన పాత్ర పోషిస్తున్నదీ. వివక్షకు పునాది వేసి, ద్వేషానికి పాలు పోస్తూ, 'సామాజిక వర్గం'గా చెలామణీ అవుతున్న సామాజిక నేరం కులం.
 
ఈ విష సర్పం నేడు సిగ్గు విడిచి, కొత్త దర్పం చూపిస్తున్నదీ, ఒకప్పటి, నేటి, బాధితుల ద్వారానే వ్యాప్తి చెందుతున్నదీ.
 
బొందలో రాజకీయ పార్టీలూ, వాటి కుల రాజకీయాలను వెనకేసుకొచ్చే చచ్చు మొఖాలూ, సమాజ పునర్నిర్మాణం అంటే రాజ్యాధికారమే అని రంకెలు వేసే వారూ కొత్త సమాజ నిర్మాణ కార్యక్రమంలో పనికిరారు. ఇతరుల బాధల మీద బ్రతికే ఫేసు బుక్కు కాస్టీయిస్టుల వల్ల ఒరిగేదీ ఏమీ లేదు. బాధితుల తరపున ఎన్నిక కాని వారి 'నాయకుల' ఓట్ల బేరాలతో బాధితులకు ఏమీ ఉపశమనం, విముక్తి లేవు, రావు.
 
మానవవాదం మానవ విలువలు మానవ హక్కులు: ఇవి మర్చి పోయి చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించవు.
 
పాపం, ప్రణయ్‌ను తలుచుకుంటూ ...
 
మారుతీరావుకు మద్దతుగా ర్యాలీ తీసిన మనువాద ముఠాకు, ప్రణయ్ హత్యను సపోర్ట్ చేసిన కులగజ్జి సైకోలకు ప్రగాఢ సానుభూతి చావులో కూడా కులాన్నితోడు తీసుకెళ్లాడు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆల్కహాల్‌తో కరోనా వైరస్‌కు చెక్? డబ్ల్యూహెచ్‌వో ఏమంటోంది?