తన ముద్దుల గారాలపట్టి అమృత చేసిన చిన్న తప్పుతో మిర్యాలగూడకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు కుటుంబ జీవితం చిన్నాభిన్నమైంది. ఒకవైపు హత్య కేసు విచారణ, మరోవైపు చుట్టిముట్టిన ఆర్థిక సమస్యలతో ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు. సమస్యలను అధికమించలేక మానసికంగా కుంగిపోయాడు. చివరకు ఆత్మహత్య చేసుకుని తనవుచాలించారు. దీనికంతటికీ కారణం మారుతీ రావు - గిరిజ దంపతుల ముద్దుల గారాలపట్టి అమృత.
తమ ఒక్కగానొక్క కుమార్తె అమృత అంటే ఆ దంపతులకు అమితమైన ప్రేమ. కూతురు పేరుతో అమృత జీనియస్ పాఠశాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలో తొమ్మిదో తరగతి చదువుతున్న దశలోనే అమృత ప్రేమలో పడింది. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతుల పెద్దకుమారుడు ప్రణయ్‌ను ప్రేమించింది. 2018 జనవరి 30న 18ఏళ్ల వయసు నిండడంతో అమృత, ప్రణయ్ ప్రేమ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఆదేనెల 31వ తేదీన హైదరాబాద్‌కు పారిపోయి ఆర్యసమాజ్ మందిరంలో పెళ్లి చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అమృత హైదరాబాద్ నుంచి నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తన తండ్రి నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఇరువురి తల్లిదండ్రులను మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి రప్పించిన పోలీసులు కౌన్సిలింగ్ చేసిన అనంతరం అమృత ప్రణయ్‌తో కలిసి ముత్తిరెడ్డికుంటలోని ప్రణయ్ ఇంటికి వెళ్లింది.
కొద్దినెలల తర్వాత గర్భం దాల్చిన భార్య అమృతను ఆరోగ్య పరీక్షల కోసం 2018 సెప్టెంబరు 14వ తేదీన జ్యోతి ఆస్పత్రికి ప్రణయ్ తల్లి ప్రేమలతతో కలిసి వచ్చింది. డాక్టర్‌ను సంప్రదించి బయటికి వస్తున్న క్రమంలో అక్కడే మాటువేసి ఉన్న సుపారీ కిల్లర్ సుబాష్ శర్మ కత్తితో దాడి చేసి ప్రణయ్‌ను హత్యకు గురయ్యాడు. అప్పటికి అమృత ఐదు నెలల గర్భవతి.
ఈ హత్య జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. కేసును ఎస్పీ ఏవీ రంగనాథ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆస్పత్రిలోని సీసీటీవీ పుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదేసమయంలో మాడ్గులపల్లి టోల్‌గేటువద్ద మారుతిరావు వాహనం సీసీటీవీలో రికార్డు కావడం కేసు విచారణకు బలాన్నిచ్చింది.