Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు పెన్ష‌న్లు పీకేయ‌డంతో... 13 మంది వృద్ధులు మృతి చెందారు!

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:40 IST)
పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న జగన్ రెడ్డి తుంచుకుంటూ పోతున్నారు. రూ.3 వేల పెన్షన్ ఇస్తానని ఆశపెట్టి మాట మార్చారు, మడమ తిప్పారు. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానని డాబు కబుర్లు చెప్పి అడ్డమైన కారణాలు చెబుతూ భారీగా పెన్షన్లు కోతపెడుతున్నారు. గత రెండు నెలల్లోనే 2.30 లక్షల పెన్షన్లు లేపేసి అవ్వా తాతలకు తీరని అన్యాయం చేసారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్య‌బ‌ట్టారు. 
 
మీరు పెడుతున్న మానసిక క్షోభ భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనే ఆధారంగా బతుకుతున్న 13 మంది  వృద్ధులు మృతి చెందార‌ని లోకేష్ ఆరోపించారు. మీరిచ్చిన హామీ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు రూ.2,750 పెన్షన్ ఇవ్వాలి. ప్రతి అవ్వా తాత దగ్గరా నెలకు రూ.500 కొట్టేస్తున్నదేకాక  భారీగా పెన్షన్లు కోసేస్తున్న పాపం వూరికేపోదు జగన్ రెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు లోకేష్.

ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారి పెన్షన్లు తీసేయడం సబబు కాదు. ఎత్తేసిన పెన్షన్లు అన్ని వెంటనే ఇవ్వాల‌ని డిమాండు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments