కుటుంబాన్ని పోషించాలన్న సంకల్పం, ప్రాణం పోయినా ఫర్వాలేదనుకునే మొండితనం 8 సంవత్సరాల గోపాలక్రిష్ణారెడ్డిని ఆటో నడిపేలా చేసింది. తల్లిదండ్రులకు కళ్ళు కనిపించకుండా కుటుంబ పోషణ బరువైతే అంతా తానై ముందు నిలబడ్డాడు.
3వ తరగతి చదువుతూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నారి ఆవేదనను చూసిన నారా లోకేష్ స్పందించారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చాడు.
తక్షణ సహాయంగా 50వేల రూపాయల నగదు, అలాగే గోపాలక్రిష్ణారెడ్డి నడుపుతున్న ఆటోకు 2 లక్షల రూపాయల సహాయం టిడిపి ద్వారా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు చిన్నారిని ఉన్నత విద్య అభ్యసించేందుకు అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చాడు.
ఆ హామీతో గోపాలక్రిష్ణారెడ్డి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. తండ్రి పాపిరెడ్డి, రేవతిల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులు ఉన్నారు.
త్వరలోనే వారి అకౌంట్లలోనే డబ్బులను జమ చేయనున్నారు నారా లోకేష్. అలాగే నేరుగా వెళ్ళి లోకేష్‌ను పాపిరెడ్డి కుటుంబం కలవబోతోంది. లోకేష్ తీసుకున్న నిర్ణయంపై టిడిపి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.