Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలంటే టెస్ట్ మ్యాచ్ .. ఓర్పు - సహనం ముఖ్యం...

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (11:28 IST)
జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలకడలేని మనస్తత్వం కారణంగా రాజీనామా చేస్తున్నట్టు లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ తగిన రీతిలో కౌంటర్ ఇచ్చారు. తనకు సినిమాలు చేయడం తప్ప మరో పని తెలియదని, పైగా, తనపై ఆధారపడి అనేక కుటుంబాలు ఉన్నాయని గుర్తుచేశారు. 
 
ఇదిలావుంటే, లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ కీలక కామెంట్స్ చేశారు. 'రాజకీయాలంటే 20-20 మ్యాచ్ కాదు. టెస్ట్ మ్యాచ్. ఓర్పు, సహనం, నిరీక్షణ ఉండాలి. నాయకుడంటే ఓడిపోగానే వదిలి వెళ్లిపోవడం కాదు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వంతో పాటు బీ ఫార్మ్ తీసుకున్నారు. ఓడిపోగానే తెల్లకాగితాల మీద రాజీనామాలు చేస్తున్నారు. నిలకడ అంటే ఇదేనా?' అని ప్రశ్నించారు. 
 
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టారు. 'రాజకీయాల్లో ఉంటూ వేల కోట్ల రూపాయలను వ్యాపారాల ద్వారా సంపాదిస్తున్న వారిని ప్రశ్నించడం చేతకావడం లేదు. ఆర్థిక నేరగాళ్లు దర్జాగా తిరుగుతుంటే, సిద్ధాంతాల మీద నిలబడిన వ్యక్తులకి నేడు కాకపోతే రేపైనా ప్రజలు అండగా నిలబడతారు' అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments