Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివ - కీర్తి హ్యాపీగా ఉండండి... అయినా ఇలా చేస్తున్నందుకు ఫీల్ అవ్వండి...

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (10:25 IST)
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ప్రేమ విఫలమైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను మనసుపడిన సహచర విద్యార్థి ఒకరు మరో యువతితో ప్రేమలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని తట్టుకోలేక పోయింది. దీంతో ఆమె సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని నూజివీడు పట్టణానికి చెందిన ఈదల గ్రామానికి చెందిన మందారాజు కుమార్తె శైలు (19) నూజివీడు బి-ఫార్మసీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరోగ్యం సరిగాలేదని తరగతి గది నుంచి హాస్టల‌కు వచ్చేసింది. ఆ తర్వాత తన చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుంది.
 
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హాస్టల్‌కు వచ్చిన కొందరు విద్యార్థినులు శైలు ఉరేసుకున్న విషయాన్ని హాస్టల్ హార్డెన్‌కు చేరవేశారు. ఆ తర్వాత కళాశాల సిబ్బందితో కలిసి హుటా హుటిన నూజివీడులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం జీఎంహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే శైలు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
 
అయితే, శైలు చనిపోయేముందు ఓ సూసైడ్ లేఖ రాసిపెట్టింది. అందులో... 'శివ, కీర్తి హ్యాపీగా ఉండండి, మిమ్మల్ని డిస్ట్రబ్‌ చేస్తున్నందుకు సారీ.. అయినా ఇలా చేస్తున్నందుకు బాగానే హ్యాపీగా ఫీల్‌ అవ్వండి' అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments