Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31-01-2020 మీ రాశి ఫలితాలు- లక్ష్మీదేవిని పూజించి, అర్చించినట్లైతే? (Video)

Advertiesment
31-01-2020 మీ రాశి ఫలితాలు- లక్ష్మీదేవిని పూజించి, అర్చించినట్లైతే? (Video)
, శుక్రవారం, 31 జనవరి 2020 (05:00 IST)
లక్ష్మీదేవిని పూజించి, అర్చించినట్లైతే శుభం కలుగుతుంది.
 
మేషం: ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. బంధువుల నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి.  
 
వృషభం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ సంతానం వైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తాయి. అధికారుల తీరుకు అనుగుణంగా మెలగాలి.
 
మిథునం: వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. మందులు, ఆల్కహాలు, కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. దూరపు బంధువుల రాక మిమ్ములను సందిగ్ధంలో పడవేస్తుంది. రాజకీయనాయకులు, సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కర్కాటకం: హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. స్త్రీలు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పుట అధికమవుతాయి. అనవసరపు వివాదాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. 
 
సింహం: కార్మికుల కృషికి తగిన ప్రతిఫలం కానరాగలదు. స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారిపోయేందుకు ఆస్కారం వుంది. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్య లెదుర్కోవలసి వస్తుంది. వ్యవసాయ తోటల వ్యాపారస్తులకు వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
కన్య: విద్యార్థినులకు ఏకాగ్రతా లోపం వల్ల ఆందోళన తప్పదు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఒక వ్యవహారంలో పట్టుదల విడనాడి విజ్ఞతతో నిర్ణయం తీసుకోవడం వల్ల మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
 
తుల: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ చాలా అవసరం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృశ్చికం: స్టాక్ మార్కెట్, బులియన్ రంగాల వారికి ఆశాజనకం. ఆడిటర్లకు, అకౌంట్స్, గణిత, సైన్స్, శాస్త్ర రంగాల వారికి కలిసిరాగలదు. ఖర్చులు పెరిగినా మీ ఆర్థికస్థితికి ఏమాత్రం లోటు ఉండదని చెప్పవచ్చు. దూరప్రయాణాలు, నూతన ప్రదేశ సందర్శనలు మీలో కొత్త ఉత్సాహం, మానసిక మార్పు కలిగిస్తాయి.
 
ధనస్సు: ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించటం వల్ల ఒక వ్యవహారం మీకు సానుకూలమవుతుంది. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు ఆలోచనలు కొనసాగుతాయి. వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి వుంటుంది.
 
మకరం: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు స్థాన చలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో మాటపడక తప్పదు. నిరుద్యోగులకు ఆశాజనకం. ఇతరుల విషయాలకు, వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
కుంభం: విద్యార్థులకు తోటివారి కారణంగా మాటపడవలసివస్తుంది. వాతావరణ మార్పు వల్ల ఆందోళనకు గురవుతారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. స్త్రీల తొందరపాటు తనం వల్ల బంధువర్గాల నుంచి మాటపడవలసి వస్తుంది. 
 
మీనం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. స్థిరచరాస్తులకు సంబంధించిన చర్చలు, వాణిజ్య ఒప్పందాలు సజావుగా పరిష్కారం కాగలవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిబాబా ఎందుకు ఉపవాసం వద్దన్నారు?