Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-01-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. ఈశ్వరుడిని పూజిస్తే..?

Advertiesment
27-01-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. ఈశ్వరుడిని పూజిస్తే..?
, సోమవారం, 27 జనవరి 2020 (05:00 IST)
మేషం : వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. ప్రేమానుబంధాలు బలపడతాయి. రిప్రజెంటేటివ్‌లు, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని ఉద్యోగస్తులకు స్థానమార్పిడికి ఆస్కారం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు చికాకు పరుస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయు యత్నంలో సఫలీకృతులవుతారు.
 
వృషభం : చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. దైవ, పుణ్యకార్యాలకు ఇతోధికంగా సహకరించడం వల్ల మీ గౌరవ, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభం. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. చేపట్టిన పనులలో ఏకాగ్రతా లోపం, వృధా ప్రయాసలు వంటి చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థుల శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. దూర ప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ వహించండి.
 
కర్కాటకం : స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యంతో అవగాహన లోపిస్తుంది. ఇతరుల వాహనం నడపడం వల్ల ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
 
సింహం : పారిశ్రామిక రంగంలోనివారికి విద్యుత్ కో, కార్మిక  సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. విద్యార్థులకు అనుకోని చికాకులు, నిరుత్సాహం ఎదురవుతాయి. ఆధ్యాత్మిక, యోగా, సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిర్మాణ పనులలో పురోభివృద్ధి, సకాలంలో పూర్తి అయ్యే సూచనలు కానవచ్చును.
 
కన్య : మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. రుణయత్నంలో ఆటంకాలు తొలగిపోతాయి. కొన్ని అనుకోని ఖర్చుల వల్ల మీ ఆర్థిక ప్రణాళికలకు భంగం వాటిల్లే ఆస్కారం ఉంది. లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలు వాయిదా పడటం మంచింది.
 
తుల : వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయడం మంచిది. రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులకు అపరిచితుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. మీ జీవిత భాగస్వామితో అనుక్షణం సంయమనంతో వ్యవహరించడం అన్ని విధాలా శ్రేయస్కరం.
 
వృశ్చికం : ఆదాయానికి తగినట్టుగా ఖర్చు చేస్తారు. కిరణా ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్త్రీలకు దైవ కార్యాలు, ఇతర వ్యాపకాల వైపు దృష్టిమళ్లుతుంది. నిరుద్యోగులు ఎటువంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో వ్యవహరించడం అన్ని విధాలా శ్రేయస్కరం.
 
ధనస్సు : వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు.
 
మకరం : ఆర్థిక ఇబ్బందులు అధికం అయినా మిత్రుల సహకారంతో సమసిపోతాయి. అధిక శ్రమతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ రంగాల్లో వారికి మెళకువ చాలా అవసరం.
 
కుంభం : పీచు, ఫోం, లెదర్, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగ మార్పిడికై చేయు యత్నాలు త్వరలోనే ఫలించగలవు. ఆకస్మికంగా మీరు తీసుకున్న ఒక నిర్ణయం కుటుంబీకులను బాధించగలదు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం.
 
మీనం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఖర్చులు అధికమైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. ఉపాధ్యాయులకు పనిభారం అధికం అవుతుంది. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-01-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఇష్టదైవాన్ని ఆరాధించినట్లైతే? (video)