Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-01-2020 శనివారం మీ రాశి ఫలితాలు- అనంత పద్మనాభ స్వామిని? (Video)

Advertiesment
25-01-2020 శనివారం మీ రాశి ఫలితాలు- అనంత పద్మనాభ స్వామిని? (Video)
, శనివారం, 25 జనవరి 2020 (05:00 IST)
అనంత పద్మనాభ స్వామిని పూజించడం వల్ల ఆర్థికాభివృద్ధి, శుభం కలుగుతుంది. 
 
మేషం: వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యేక గుర్తింపు, పురోభివృద్ధి ఉంటుంది. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ ప్రత్యర్థుల విషయంలో ఏమరుపాటు కూడదు. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. స్త్రీలకు శకునాలు, బంధువుల వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
వృషభం: పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారు మితంగా మాట్లాడి పనియందు ధ్యాస వహించాలి. మీ మాటలు ఇతరులకు చేరేవేసే వ్యక్తుల పట్ల ఇబ్బందులెదుర్కుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. మీ జీవిత భాగస్వామితో కలహాలు, చికాకులు తలెత్తుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మిథునం: ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం ఉత్తమం. ప్రింటింగ్ రంగాల వారికి రావలిసిన బకాయిలు అతికష్టం మీద వసూలు కాగలవు. మీ సంతానం ఫీజులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు ఒత్తిడి, ధన ప్రలోభాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యం వ్యవహరించండి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు నిదానంగా సానుకూలమవుతాయి. శ్రమాధిక్యత, మితిమీరిన ఆలోచనల వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు.
 
సింహం: కాంట్రాక్టర్లకు కార్మికులతో సఖ్యత నెలకొంటుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాట వేయండి. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. వైద్య రంగాల వారికి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కన్య: గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలెదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. స్త్రీలకు అయిన వారి నుంచి రావలసిన ధనం అందుతుంది. 
 
తుల: ఏజెంట్లు, బ్రోకర్లు, చేతివృత్తుల వారికి నిరుత్సాహం తప్పదు. ఖర్చులు అధికమైనా ధనానికి లోటుండదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తిపరమైన ఆటంకాలు క్రమంగా తొలగిపోగలవు. దంపతుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. 
 
వృశ్చికం: కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కొన్ని విషయాల్లో మీరెంత తెలివిగా వ్యవహరించినా ఫలితాలు భిన్నంగానే ఉంటాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో ఏమార్పులుండవు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత అంకితభావం ముఖ్యం.
 
ధనస్సు: వాహనాలను ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నూతన సంస్థలు, పరిశ్రమల స్థాపనకు యత్నాలకు సాగిస్తారు. సంఘంలో మీకు పేరు, ఖ్యాతి లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు.
 
మకరం: బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. భాగస్వామికుల మాటతీరు, కదలికలను గమనించడం ఎంతైనా మంచిది. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. 
 
కుంభం: వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టులో దావా వేసే విషయంలో పునరాలోచన మంచిది. మీ వాహనం, విలువైన వస్తువులు ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు.
 
మీనం: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మంచిది కాదు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం వుంటుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవిసె ఆకుతో విష్ణుప్రీతి.. ఆ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే?