Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-01-2020 గురువారం మీ రాశి ఫలితాలు-రాఘవేంద్రస్వామిని పూజిస్తే..

Advertiesment
30-01-2020 గురువారం మీ రాశి ఫలితాలు-రాఘవేంద్రస్వామిని పూజిస్తే..
, గురువారం, 30 జనవరి 2020 (05:00 IST)
రాఘవేంద్రస్వామిని పూజించినా సర్వదా శుభం
 
మేషం: అందరితో కలిసి వేడుకలు, విందులు, వినోదాలలో పాల్గొంటారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. బంధుమిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. లౌక్యంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా సాగుతాయి. దూర దేశాలకు వెళ్ళే ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇంటా బయటా మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మిథునం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు. విద్యార్థుల మొండి వైఖరి వల్ల ఉపాధ్యాయులు నిరుత్సాహం చెందుతారు. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. 
 
కర్కాటకం: నిర్వహణ లోపం వల్ల వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింత పెరిగేందుకు ఆస్కారం వుంది. 
 
సింహం: రుణ విముక్తులు కావటంతో పాటు కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకు సాగి పూర్తి చేస్తారు. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. 
 
కన్య: వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుకుంటారు. ఉద్యోగ వేతన సమస్యలు వంటివి ఏర్పడుతాయి. రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. కోర్టు పనులు వాయిదా పడటం మంచిది. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
తుల: ఐరన్, సిమెంట్ వ్యాపారస్తులకు నిరుత్సాహం కానరాగలదు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లైతే సత్ఫలితాలు పొందుతారు. స్త్రీలు వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులను కలుసుకుని బహుమతులను అందజేస్తారు. 
 
వృశ్చికం: దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. 
 
ధనస్సు: ఉద్యోగస్తులకు అధికారుల నుంచి అడ్వాన్సులు అందుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు పడతారు. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హడావుడి అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్య భంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. దుబారా ఖర్చులు అధికమవుతాయి.
 
మకరం: బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. కోళ్ల, మత్స్య, పాడి పరిశ్రమల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. నూతన వాతావరణం, కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. 
 
కుంభం: సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓర్పుతో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. 
 
మీనం: మీ కళత్ర వైఖరి చికాకు కలిగిస్తుంది. విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఉద్యోగస్తులు అధికారులతో మాటపడక తప్పదు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. బంధుమిత్రుల నుంచి నిష్టూరాలు ఎదుర్కోవలసి వుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంద్రకీలాద్రి అమ్మవారికి 63 గ్రాముల బంగారు గాజులు