Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు - విత్తమంత్రి చేతిలో ఆర్థిక సర్వే

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు - విత్తమంత్రి చేతిలో ఆర్థిక సర్వే
, శుక్రవారం, 31 జనవరి 2020 (09:43 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులోభాగంగా, శుక్రవారం వార్షిక బడ్జెట్ సమావేశాలు ఆరంభంకానున్నాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
 
దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 45 బిల్లులను ఉభయసభల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే గురువారం అఖిలపక్ష సమాశం ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఏప్రిల్ ౩వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. 
 
కాగా, ఈ బడ్జెట్‌పై మధ్య తరగతి, వేతన జీవులతో పాటు.. కార్పొరేట్ రంగాల వారు భారీ ఆశలనే పెట్టుకున్నారు. ప్రధానంగా గతేడాది కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గించడంతో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకూ ఊరట కల్పించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడంతోపాటు సెక్షన్‌ 80సీ పరిమితినీ పెంచాలని కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ : గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ