శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు - రేపు అమ్మఒడి మూడో విడత నిధులు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (14:38 IST)
ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు నిధుల పంపిణీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అంటోంది. ఇందులోభాగంగానే అమ్మఒడి మూడో విడత నిధులను బుధవారం జమ చేయాలని భావిస్తుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేయనున్నారు. 
 
అంటే 2021 సంవత్సరంలో అక్టోబరు - డిసెంబరు నెలకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకం కింద ఈ ఆర్థిక సాయం చేయనుంది. ఈ సారి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దీంతో ఒకేసారి రూ.709 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 
 
ఈ విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని విద్యార్థుల తల్లులకు అందజేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

Riya Singha: జెట్లీ నుంచి మిస్ యూనివర్స్ రియా సింఘా ఫస్ట్ లుక్ రిలీజ్

జై బాలయ్య అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సఃకుటుంబానాం

Jin: వైవిధ్యభరితమైన కథతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments