Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీచర్ కాదు కీచకుడు.. 60మంది విద్యార్థినులను లైంగికంగా వేధించాడు.. ఎక్కడ?

Advertiesment
harrasment
, శనివారం, 14 మే 2022 (11:08 IST)
కీచక ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది. 30 ఏళ్ల సర్వీసులో ఈ కీచకుడు 60మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. కేరళ మలప్పురం మున్సిపాలిటీలో సీపీఎం కౌన్సిలర్ గా ఉన్న కేవీ శశికుమార్.. పట్టణంలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో టీచర్ గా పనిచేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు. 
 
ఇతడు ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో వేధింపులకు గురి చేసినట్టు శశికుమార్‌కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదైంది. 50 మందికి పైగా కలసి ఫిర్యాదు చేశారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడిని అతడు తనకు రక్షణగా ఉపయోగించుకున్నాడు. దాంతో అతడి అఘాయిత్యాలపై ఎవరూ ధైర్యం చేసి చెప్పలేకపోయారు. శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న మాజీ విద్యార్థిని ఒకరు అతడి లీలలను బయటపెట్టింది. 
 
ఆరోపణలు రావడంతో వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమిత్ షాపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం