Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఘోరం : విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు - విద్యార్థి మృతి

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (11:58 IST)
గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. కారు ఒకటి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. 
 
విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమీపంలో సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో బాపట్ల ఆదర్శనగర్‌ వద్దకు చేరుకోగానే వేగంగా ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్ళింది. సమయానికి అక్కడే ఉన్న మత్స్యకారులు కారు అద్దాలు పగలగొట్టి వారందర్నీ రక్షించారు. అయితే, ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. 
 
గాయపడిన మరో ఏడుగురిని స్థానిక వైద్యశాలకు తరలించారు. నిహారిక , సాయి తులసి అనే ఇద్దరు విద్యార్థుల తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో మత్స్యకారులు స్పందించకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments