సి ఎంవో అదేశాలతో కదిలిన అదికార గణం
విజయవాడ , శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (11:08 IST)
గత సంవత్సర కాలంగా గుంటూరు జిల్లా పొన్నూరు, చిల్లకలూరిపేటలు కేంద్రాలుగా రేషన్ బియ్యం ఆక్రమ రవాణా జరుగుతోందనే అంశంపై సీఎంఓ సీరియస్ అయింది. ఇక్కడ రేషన్ బియ్యం రీసైకిల్ చేస్తున్నపలు వాహనాలను సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. ఇంత చేసినా, అర్ధరాత్రి పొన్నూరులో రీసైకిల్ చేసిన రేషన్ బియ్యం రెండు పెద్ద లారీల సరుకును లొకల్ పోలీసులు కాకుండా బైట పొలీసులు పట్టు కున్నారు. ఇక్కడ బియ్యం దందాపై సి యమ్ వొ స్పందించింది.
గుంటూరు అధికారులను కాకుండా, తెనాలి యువ సబ్ కలెక్టర్కి ప్రత్యేకంగా ఫోన్ చేసిన సి ఎంవో అదికారులు స్వయంగా రంగంలోకి దింపారు. రేషన్ బియ్యంను రీ సైకల్ చేస్తున్న అన్ని మిల్లులను తనిఖీ చేసి, వాటిని సీల్ వేయమని ఆదేశాలు జారీ చేశారు. భారీ ఎత్తున పట్టుబడిన రేషన్ బియ్యం వెనుక ఉన్న సూత్రదారులను, పాత్ర దారులను ఏవరినీ వదిలి పెట్టవద్దని, ఏంతటి వారినైన తక్షణమే అరెస్ట్ చేయమని మౌఖిక అదేశాలను సి ఎం అపీసు ఇచ్చింది.
సీఎంవో అదేశాలతో హుటహుటీన కదిలిన తెనాలి జెసి, వారి సిబ్బంది పలు మిల్లులకు సీలు వేశారు. జేసీ నిధి స్వయంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. పుర్తి వివరాలను నేరుగా సి మయ్ వొ కు తెలిపారు.
తర్వాతి కథనం