Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ వేధింపులు... గ్రామ వలంటీరు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (17:48 IST)
ఓ మహిళ దుర్భాషలాడటంతో భరించలేని ఓ వలంటీరు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జీలుగుమిల్లి మండలం దర్భగూడెం పంచాయతీ పండువారిగూడెంకు చెందిన పండు నవీన(23) ఇటీవల గ్రామ వలంటీరుగా సొంతూరిలోనే విధులు నిర్వహిస్తోంది. 
 
గ్రామానికి చెందిన పూనెం మంగ తన ఆధార్‌ కార్డులో ఇంటి పేరు మార్చాలని కోరారు. శనివారం సదరు మహిళ ఆధార్‌లో పేరు మార్పు విషయంపై నవీనపై దుర్బాషలాడింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవీన రాసిన సూసైడ్‌ నోట్‌ ద్వారా ఈ విషయాలు తెలిశాయని తండ్రి శ్రీరామ్మూర్తి వాపోయాడు.
 
వలంటీరు నవీనను చూసిన తోటి వలంటీర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వలంటీర్లకు ముందుగా మానసికంగా సిద్ధపడేలా శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చాల్సిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొందరు వలంటీర్లు మాత్రం మండల అధికారులు పరిష్కరించాల్సిన సమస్యలు తమపై రుద్దడం దారుణమని వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments