తెలిసినోడే కదా అని బైకు ఎక్కిన మహిళ... ఆ తర్వాత...

శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (09:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. జిల్లాలోని రామడుగు మండలం కొరటపల్లికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
స్థానిక పోలీసుల సమాచారం మేరకు... కొరటపల్లికి చెందిన యువతి కరీంనగర్‌కు వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన మేకల నరేష్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై కరీంనగర్‌ వరకు తీసుకెళ్తానని నమ్మించాడు. 
 
బైక్‌పై వెళ్తూ మార్గమధ్యంలో కొక్కెరకుంట ప్రాంతంలో భయబ్రాంతులకు గురిచేసి అత్యాచారం చేసినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గెస్ట్‌హౌస్‌లలో చీకటి బాగోతాలు... కొన్నింట్లో వ్యభిచారం