Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు లాడ్జీల్లో న్యూడ్ డ్యాన్సులు... అమ్మాయిలు..?

కర్నూలు జిల్లాలోని పలు లాడ్జీల్లో అశ్లీల (న్యూడ్) డ్యాన్సులకు వేదికగా మారుతున్నాయి. తాజాగా ఓ లాడ్జీలో అశ్లీల నృత్యాలు వేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది.

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (12:21 IST)
కర్నూలు జిల్లాలోని పలు లాడ్జీల్లో అశ్లీల (న్యూడ్) డ్యాన్సులకు వేదికగా మారుతున్నాయి. తాజాగా ఓ లాడ్జీలో అశ్లీల నృత్యాలు వేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జీలో ఆకస్మిక తనిఖీలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ముగ్గురు డ్యాన్సర్లు, నలుగురు ఈవెంట్ నిర్వాహకులు, ఎరువుల కంపెనీ డీలర్లు ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారి వివరాలు గోప్యంగా ఉంచారు. 
 
నిజానికి ఇటీవలి కాలంలో కర్నూలు పట్టణంలోని పలు లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు ఎక్కువగానే వస్తున్నాయి. పార్టీల పేరుతో లాడ్జీలలో యధేచ్ఛగా అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో స్పందించిన పోలీసులు లాడ్జీలపై ఓ కన్నేశారు. ఆదివారం పక్కా సమాచారంతో షీ టీమ్స్‌తో కలిసి దాడి చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. 
 
ఈ పార్టీల్లో అశ్లీల నృత్యాలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తం డబ్బులు చెల్లించి అమ్మాయిలను తీసుకొచ్చినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ అశ్లీల డ్యాన్సులు పగలు రాత్రి అనే తేడా లేకుండా సాగించడంతో సమాచారం బయటకు పొక్కి పోలీసులకు చేరింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments