Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీఎస్టీ కేసు: వర్మను అరెస్ట్ చేస్తారా? రెండేళ్ల నుంచి ఏడేళ్ల జైలుశిక్ష పడే ఛాన్స్?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది అతనిపైనే ఆధారపడి వుంటుందని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ అన్నారు. ''జీఎస్టీ'' వెబ్ చిత్రం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల

జీఎస్టీ కేసు: వర్మను అరెస్ట్ చేస్తారా? రెండేళ్ల నుంచి ఏడేళ్ల జైలుశిక్ష పడే ఛాన్స్?
, శనివారం, 17 ఫిబ్రవరి 2018 (16:42 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది అతనిపైనే ఆధారపడి వుంటుందని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ అన్నారు. ''జీఎస్టీ'' వెబ్ చిత్రం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అశ్లీలతపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. అలాగే ఈ సినిమాలో మహిళలను కించపరిచారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ కేసుపై విచారణ నిమిత్తం వర్మ సీసీఎస్ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనతో పాటు అడ్వొకేట్ కూడా వచ్చారు. 
 
విచారణలో వీరిద్దరే పాల్గొన్నారని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ అన్నారు. వర్మ వద్ద పూర్తి స్థాయిలో విచారణ జరిపామని తెలిపారు. సామాన్య వ్యక్తిగానే వర్మను పరిగణిస్తామని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సినిమాకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్, మహిళలను కించపరిచేలా మాట్లాడారనే దానికి సంబంధించి మరొక ఎఫ్ఐఆర్ ఆయనపై నమోదయ్యాయని.. ఆర్జీవీ ఇచ్చే సమాధానాలను బట్టే ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాతే అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 
వర్మ కేసు సాధారణమైంది కాదని, ఒకవేళ వర్మ దోషిగా తేలితే.. రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం వుందన్నారు. టెక్నికల్‌గా చాలా ఆధారాలను సేకరించాల్సి వుందన్నారు. జీఎస్టీలో అశ్లీలత, మహిళలపై అభ్యంతరకరమైన కామెంట్స్ సంబంధించి శనివారం వర్మ వద్ద విచారణ పూర్తయ్యింది. మూడున్నర గంటల సేపు ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వర్మను 25 ప్రశ్నలేశారని సమాచారం. విచారణ ముగిసిన వెంటనే మరో నోటీసును వర్మకు అందజేశారు. వచ్చే శుక్రవారం కూడా మళ్లీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌ను పోలీసులు సీజ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియా వారియర్‌ సైగలకు రిషి కపూర్ ఫిదా.. నేనున్న రోజుల్లో ఎందుకు రాలేదు?