Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కలుగులో ఎలుకలా దాక్కున్నాడు : రోజా

ప్రత్యేక హోదాపై ఎవరైనా ప్రశ్నిస్తారన్న భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగులో ఎలుకలా దాక్కుని తిరుగుతున్నాడని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఓటుకు నోటు కేసు‌లో బయట పడేందుకు చంద్రబాబు ఏపీ రాష్ట్ర ప్రజల

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (12:07 IST)
ప్రత్యేక హోదాపై ఎవరైనా ప్రశ్నిస్తారన్న భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కలుగులో ఎలుకలా దాక్కుని తిరుగుతున్నాడని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఓటుకు నోటు కేసు‌లో బయట పడేందుకు చంద్రబాబు ఏపీ రాష్ట్ర ప్రజలను కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. వైసీపీ ఎంపీ‌లు రాజీనామా చేస్తానడంతోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా కదలిక వచ్చి చర్చ జరుగుతోందన్నారు. అంతకుముందు ప్రత్యేక హోదాపై కేంద్రం అస్సలు పట్టించుకోలేదన్నారు.
 
కేంద్రంతో అతుక్కుని పోయిన టీడీపీ ఎంపీ‌లు రాజీనామా చేసి బయటకు వస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదన్నారు. చంద్రబాబు అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అలా చేస్తే ఆయన చేసిన తప్పులన్ని బయట పడుతుందనే మోడీ చేతిలో కీలు బొమ్మలా మారారని విమర్శించారు. 
 
అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌ను తెరపైకి తీసుకు వచ్చి ఆయన తో ఏవో రెండు మాటలు మాట్లాడించి సమస్యను పక్క దారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కోసం మాత్రమే పాకులాడుతున్నాడు కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం దారుణమని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments