కిక్కిరిసిపోతున్న హైదరాబాద్ నగర జైళ్లు.. ఎందుకు?
హైదరాబాద్ మహానగరంలోని జైళ్లన్నీ నిండిపోతున్నాయి. ఈ జైళ్ళకు వస్తున్న వారంతా తీవ్రమైన నేరాలు చేసినవారు కాదు. కేవలం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారే కావడం గమనార్హం.
హైదరాబాద్ మహానగరంలోని జైళ్లన్నీ నిండిపోతున్నాయి. ఈ జైళ్ళకు వస్తున్న వారంతా తీవ్రమైన నేరాలు చేసినవారు కాదు. కేవలం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారే కావడం గమనార్హం.
సాధారణంగా దొంగతనం, దోపిడీ, హత్యలు, అత్యాచారాలువంటి నేరాలు చేసిన వాళ్లు జైలుకెళుతుంటారు. కానీ, ఇపుడు హైదరాబాద్‌లో పరిస్థితి తారుమారైంది. మత్తు కోసం మందేసి, వాహనం నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడితే చాలు... జైలు శిక్ష అనుభవించక తప్పదన్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా హైదరాబాద్ నగరంలోని అన్ని జైళ్ళలో మందుబాబుల సందడి కనిపిస్తోంది.
హైదరాబాద్, చంచల్‌గూడ జైలు అధికారుల గణాంకాల మేరకు 2017లో మొత్తం 9,650 మంది ఖైదీలు జైల్లో ఉండగా, వారిలో మందుబాబులు 6,511 మంది. ఇక ఈ సంవత్సరం జనవరిలో 1,758 మంది జైలుకు వెళ్లగా, అందులో 920 మంది మందుబాబులే కావడం గమనార్హం. అంటే, గత యేడాది జైలుకు వెళ్లిన వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మద్యం తాగి వాహనాలు నడిపిన వారు కాగా, ఈ సంవత్సరం ప్రతి ఇద్దరిలో ఒకరు అదే నేరం చేసి జైలుకు వెళుతున్న పరిస్థితి.