Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫలించిన భారత్ ఒత్తిడి.. హఫీజ్ సయీద్ ఉగ్రవాదే : పాకిస్థాన్

అంతర్జాతీయంగా భారత్ చేసిన ఒత్తిడి ఫలిచింది. ఫలితంగా ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాదే అని పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేనా, ఆయనకు చెందిన రాజకీయ పార్టీపై కూడా

ఫలించిన భారత్ ఒత్తిడి.. హఫీజ్ సయీద్ ఉగ్రవాదే : పాకిస్థాన్
, మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (12:23 IST)
అంతర్జాతీయంగా భారత్ చేసిన ఒత్తిడి ఫలిచింది. ఫలితంగా ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాదే అని పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేనా, ఆయనకు చెందిన రాజకీయ పార్టీపై కూడా నిషేధం విధించింది.
 
అలాగే, జమాత్ ఉద్ దువా ప్రధాన కార్యాలయంతో పాటు 26 ప్రాంతీయ కార్యాలయాల ముందు ఉన్న బారికేడ్లను సోమవారం తొలగించినట్లు పాక్ ప్రకటించింది. యూఎన్ఎస్సీ నిషేధం విధించిన జమాత్ ఉద్ దువా, లష్కరే తోయిబా, అల్‌ఖైదా, తాలిబన్ ఉగ్రవాద సంస్థలతో పాటు పలు ఉగ్రవాద సంస్థలను ఉగ్రవాద జాబితాలో పాకిస్థాన్ చేర్చింది. 
 
ఈమేరకు 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసింది. ఈ ఆర్డినెన్స్‌పై ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ సంతకం చేశారు. దీంతో ఈ విషయాన్ని పాక్ అధికారులు ధృవీకరించారు. హఫీజ్ సయీద్ బ్యాంకు లావాదేవీలను జప్తు చేసినట్లు తెలుస్తోంది. 
 
అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్‌‌ను అమెరికా గుర్తించి అతనిపై 10 మిలియన్‌ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది. పాక్‌ రాజకీయాల్లో హఫీజ్ క్రియాశీలకంగా మారుతున్ననేపథ్యంలో పాకిస్థాన్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొటానికల్ గార్డెన్ మర్డర్ కేసు : భర్త కళ్లెదుటే వదినను నరికి ముక్కలు చేశాడు