Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ప్యాడ్ మ్యాన్' చూసేందుకు ఛీ అంటున్న పాక్ సెన్సార్ బోర్డు సభ్యులు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్ర "ప్యాడ్ మ్యాన్". మహిళల రుతుక్రమంపై చర్చిస్తూ, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన పెంచుతూ ఈ చిత్ర కథ సాగుతోంది.

'ప్యాడ్ మ్యాన్' చూసేందుకు ఛీ అంటున్న పాక్ సెన్సార్ బోర్డు సభ్యులు
, సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:07 IST)
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్ర "ప్యాడ్ మ్యాన్". మహిళల రుతుక్రమంపై చర్చిస్తూ, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన పెంచుతూ ఈ చిత్ర కథ సాగుతోంది. ఈ చిత్రం ఓ వైపు బాక్సాఫీసు వద్ద దూసుకెళుతుండగా, అసలు ఈ చిత్రాన్ని చూసేందుకు కూడా పాకిస్థాన్ సెన్సార్ బోర్టు సభ్యులు నిరాకరించారు.
 
ఈ చిత్రం తమ ఆచారాలు, సంప్రదాయాలను నాశనం చేసేలా ఉందని సెన్సార్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ప్యాడ్ మ్యాన్ చిత్ర దర్శకుడు ఆర్ బాల్కీ ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి తీసిన సినిమా సంప్రదాయాలకు విరుద్ధమని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. 
 
ఈ చిత్రాన్ని పాక్‌లో ప్రదర్శనకు అనుమతించాలని కోరారు. ఆసియాలో నెలసరి సమస్యలతో మరణించిన వారు ఎందరో ఉన్నారని, ఇక్కడి మహిళలకు ఈ చిత్రం అవసరమన్నారు. అయితే, పాక్ సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని చూసి సర్టిఫికేట్ ఇచ్చేందుకు ససేమిరా అనడంతో ఈ చిత్రం పొరుగు దేశంలో విడుదలకు నోచుకోలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతడు నాతో వ్యాపారం చేయాలనుకున్నాడు.. థ్యాంక్స్ విశాల్: అమలా పాల్‌