Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ లెఫ్టార్మ్ పేస‌ర్‌ను మాత్ర‌మే నేను అభినందించా : రాహుల్ ద్రావిడ్

అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూంకు వెళ్లి వారితో సంభాషించినట్టు వచ్చిన వార్తలపై భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు.

Advertiesment
పాక్ లెఫ్టార్మ్ పేస‌ర్‌ను మాత్ర‌మే నేను అభినందించా : రాహుల్ ద్రావిడ్
, మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:58 IST)
అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూంకు వెళ్లి వారితో సంభాషించినట్టు వచ్చిన వార్తలపై భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. ముఖ్యంగా, పాకిస్థాన్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ అనంత‌రం ద్ర‌ావిడ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లినట్టు వార్తలు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ రూమర్లపై ద్రావిడ్ స్పందిస్తూ, 'నేను పాక్ డ్ర‌స్సింగ్ రూమ్‌కు వెళ్లిన‌ట్టు వచ్చిన వార్త‌లు అబ‌ద్ధం. పాక్ జ‌ట్టులోని ఓ లెఫ్టార్మ్ పేస‌ర్‌ను మాత్ర‌మే నేను అభినందించా. అది కూడా డ్రెస్సింగ్ రూమ్‌కు బ‌య‌టే. ఈ నేప‌థ్యంలో మ‌న కుర్రాళ్లు బాగా ఆడార‌ని పాక్ కోచ్ కూడా ప్ర‌శంసించారు. అంతే జ‌రిగింది. మిగిలిన వ‌న్నీ అబ‌ద్ధాలేన' అని ద్రావిడ్ స్పష్టం చేశాడు.
 
కాగా, భారత క్రికెట్ జట్టులో ఓ ఆట‌గాడిగా ఎన్నో మ‌ర‌పురాని విజ‌యాలు అందించిన రాహుల్ ద్రావిడ్‌.. ఇపుడు కోచ్‌గా కూడా త‌న విజ‌య ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఇటీవ‌ల అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త యువ‌జ‌ట్టుతో పాటు.. భారత్ ఏ జట్లకు ద్ర‌విడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లలేదు.. పేస్ బౌలర్‌ని అభినందించా: ద్రవిడ్