కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. తేదీలు ఖరారు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (08:25 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలో సెప్టెంబరు 1, 2 తేదీల్లో పర్యటించనున్నారు. సెప్టెంబరు 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం ఇడుపులపాయ వెళ్లనున్నారు. 
 
ఇందుకోసం ఆయన సెప్టెంబరు 1న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప వెళ్లనున్న సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆరోజు రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్లో సీఎం జగన్ బస చేస్తారు. సెప్టెంబరు 2న ఉదయం వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించి తిరుగు ప్రయాణం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
ఇదిలావుండగా, ప్రస్తుతం సీఎం జగన్ ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. ఈనెల 28న ముఖ్యమంత్రి జగన్ వివాహం జరిగి 25 ఏళ్లు పూర్తయ్యాయి. సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ఈనెల 26 నుంచి వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి..రేపు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments