Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారా హిల్స్‌లో కుమార్తెపై మారుతండ్రి లైంగికదాడి

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (13:18 IST)
తల్లితో సహజీవనం చేస్తూ వచ్చిన ఓ కామాంధుడు.. ఆమె కుమార్తెపై కూడా లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆ కామాంధుడు పారిపోయాడు. ఆ తర్వాత తల్లీకుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వ్యక్తికోసం గాలిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
పోలీసుల కథనం మేరకు.. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన మహిళ (32)కు 2006లో వివాహమైంది. కుమారుడు(17) కుమార్తె(15) ఉన్నారు. కుటుంబంలో గొడవల నేపథ్యంలో భర్తను వదిలేసి తన పిల్లలతో కలిసి ఆమె నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెంది సెంట్రింగ్‌ పనిచేసే బేతమాల కృష్ణ(35)తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఆ మహిళతో పాటు.. పిల్లలకు తండ్రి స్థానంలో ఉంటానని నమ్మించడంతో అతనితో కలిసి సహజీవనం చేస్తోంది. కొద్ది నెలల కిందట వారు, పనికోసం నగరానికి వచ్చి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14 సమీపంలో పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. 
 
అయితే, బోనాల పండుగ నేపథ్యంలో మెట్టుగూడ ప్రాంతంలో ఉన్న మహిళ తల్లి ఇంటికి కుమార్తెను పంపింది. తిరిగి వచ్చినప్పటి నుంచి కుమార్తె దిగులుగా, భయం భయంగా ఉండటంతో తల్లి ఆరా తీసింది. ఈ నెల 7న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణ తనపై లైంగిక దాడికి చేశాడంటూ బోరున విలపిస్తూ తల్లికి వివరించింది. 
 
దీంతో ఆమె కృష్ణతో గొడవ పడటంతో అక్కడినుంచి పరారయ్యాడు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం