Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
, మంగళవారం, 31 ఆగస్టు 2021 (10:17 IST)
తెలంగాణ పోస్టల్ సర్కిల్‌లో ఉద్యోగాలు ఖాళీలున్నాయి. తాజాగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్ కార్యాలయం, హైదరాబాద్ పోస్టల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోచ్చు. 
 
ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్డీసీ, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అప్లై చేసేందుకు సెప్టెంబర్ 24ను ఆఖరి తేదీ. 
 
స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. మొత్తం పోస్టులు 55, పోస్టల్‌ అసిస్టెంట్‌ 11, సార్టింగ్‌ అసిస్టెంట్‌ 08, పోస్ట్‌మ్యాన్‌/ మెయిల్‌ గార్డ్ 26, ఎంటీఎస్‌ 10.
 
పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుకి అయితే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తప్పని సరిగా 12 వ తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. పోస్ట్ మ్యాన్ పోస్టులకి 12వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. తప్పని సరిగా స్థానిక భాష (తెలుగు) వచ్చి ఉండాలి. కనీసం టెన్త్ వరకు టెన్త్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రం డ్రామాలు, రాష్ట్ర ఎంపీల రాజ‌కీయాలు... ఇక‌నైనా క‌ట్టిప‌ట్టండి!