Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పంజా విసురుతున్న బ్లాక్ ఫంగస్...

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (12:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అనేక కేసులు నమోదైవున్నాయి. ఈ నేపథ్యంలో ఫంగస్‌పై ముఖ్యమంత్రి జగన్ అత్యున్నత సమీక్షను నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,179 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. వీరిలో 1,068 మందికి వైద్యం అందుతోందని... 97 మంది ఫంగస్ నుంచి కోలుకున్నారని చెప్పారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
 
అయితే, కరోనా వైరస్ సోకని వారికి కూడా ఈ బ్లాక్ ఫంగస్ సోకుతుందని, ఇలాంటి వారు రాష్ట్రంలో 40 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఎక్కువగా ఈ ఫంగస్ బారిన పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ కీలక ఆదేశాలను జారీ చేశారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. 
 
దీనికి సమాధానంగా అధికారులు మాట్లాడుతూ... ఇంజెక్షన్లు కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ఆధారంగానే రాష్ట్రానికి వస్తున్నాయని, మందులను మాత్రం అవసరమయినంత మేరకు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంజెక్షన్ల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments