Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ పాలనలో కాదేదీ కబ్జాకు అనర్హం... మంత్రి జవహర్

జగన్ పాలనలో కాదేదీ కబ్జాకు అనర్హం... మంత్రి జవహర్
, సోమవారం, 31 మే 2021 (16:38 IST)
ఏపీ సీఎం జగన్ పాలనలో కాదేదీ కబ్జాకు అనర్హం... కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి రెండేళ్లపాలన సాగిందని, రెండేళ్ల  పాటు ఇసుకదోపిడీలో చేసిన అవినీతిచాలదన్నట్లు, జేపీ పవర్ వెంచర్స్ ముసుగులో ముఖ్యమంత్రి రూ.10 వేల కోట్ల ఇసుకదోపిడీకి తెరలేపాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్  తెలిపారు. సోమవారం ఆయన జూమ్ యాప్ ద్వారా తననివాసంనుంచి విలేకరులతో మాట్లాడారు.  
 
రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలకు 20 రెట్లు కష్టాలు పెరిగాయని, సాధారణంగా ఎవరైనా గత అనుభవాలనుంచి పాఠాలు, గుణపాఠాలునేర్చుకుంటారని, కానీ ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడన్నారు. అందుకు ఉదాహరణ ఇసుకవిధానమేనన్న మాజీమంత్రి, జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకు రాష్ట్రంలోని ఇసుకరీచ్ లన్నింటినీ అప్పగించిన ముఖ్యమంత్రి, రూ.10వేల కోట్ల దోపిడీకి జగన్ మాస్టర్ ప్లాన్ వేశాడన్నారు. 
 
తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసు క లారీ రూ.20 వేలకు లభిస్తే, నేడు అదేలారీ ఇసుకను రూ.50వేలకుపైబడి కొనుగోలుచేయాల్సి వస్తోందన్నారు. ఉచిత ఇసుకవిధానాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి రెండేళ్లపాటు దాన్ని తన అనుమాయులకు కట్టబెట్టి వారుదోచుకోవడానికి సహకరించాడన్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే స్వయంగా లారీలుకొని, వాటికి తమపేరుతో ఉన్న బోర్డులు తగిలించిమరీ ఇసుకవ్యాపారం చేశారని జవహర్ చెప్పారు. 
 
తానేటి పేరుతో కొవ్వూరులో, ఇతరత్రాప్రాంతాల్లో ఇతరుల పేరుతో యథేచ్ఛగా దోపిడీచేశారన్నారు. మంత్రి పెదిరెడ్డి అనుచరులు నేడుకూడా కొవ్వూరులో మకాంవేసి మరీ, ఇసుకదోపిడీని దగ్గరుండి కొనసాగిస్తున్నారన్నారు. ఎవరైనా అక్కడున్నవారిని ఎవరుమీరని అడిగితే, తాము కడపనుంచి వచ్చామనే సమాధానం వస్తోందన్నారు. కడపవారికి కొవ్వూరు, పోలవరంలోఏంపనో, ఎందుకుంటున్నారో ప్రభుత్వం సమాధానంచెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. 
 
ఇసుకటెండర్లను సబ్ లీజుకు తీసుకున్నామని వారు చెబుతున్నారన్నారు. తొలుత టన్నుఇసుకధరను ప్రభుత్వం రూ.375గా నిర్ణయించిందని, తరువాత రూ.475 కు పెంచిందన్నారు. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరుతో ప్ర భుత్వం హోల్ సేల్ ఇసుక దోపిడీకి తెరతీసిందన్నారు. 18 టన్నుల ఇసుక కొనుగోలే రూ.12,150వరకు పడుతోందని, అంటేటన్ను దాదాపు రూ.600వరకు పడుతోందన్నారు. ఎల్ అండ్ టీపేట లోని ఇసు కరీచ్‌లో 18టన్నుల ఇసుకకు రూ.12,150వరకు వసూలుచేసినట్లు లారీ నెంబర్‌తోసహా బిల్లునికూడా ఇచ్చారన్న మాజీమంత్రి, దాన్ని విలేకరులకు చూపించారు. 
 
ప్రభుత్వం జయప్రకాశ్ వెంచర్స్ కు చెప్పిన రేటు ఒకటైతే, వారు ప్రజల నుంచి వసూలుచేస్తున్న రేటు మరోరకంగా ఉందన్నారు. 18టన్నుల లారీ కొనుగోలే రూ.12,150పడితే, దాన్ని బహిరంగ మార్కెట్లో ఎంతకు విక్ర యిస్తారో చెప్పాల్సిన పనిలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.20వేలకే లభించిదన్నారు. డ్రెడ్జింగ్ పేరుతో కృష్ణానదిలో 1.2కోట్ల టన్నుల ఇసుకను తవ్వుతున్నారని, అలా తీసినదాన్ని ఎక్కడికక్కడే అందినకాడికి అమ్ముకుం టున్నారన్నారు. 
 
జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఇసుక విధానం ఎంత లోపభూయిష్టంగాఉందో ప్రత్యేకంగాచెప్పాల్సి న పనిలేదన్నారు. తొలిరెండేళ్లపాటు తనమంత్రులు, ఎమ్మెల్యేలకు దోపిడీకి అవకాశమిచ్చి, వారిద్వారా తనకు రావాల్సినదాన్ని రాబట్టుకున్న ముఖ్యమంత్రి, ఇప్పుడేమో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ముసుగులో సరికొత్తగా నేరుగా తనకే దోపిడీ సొమ్ముంతా చేరేలా పథకరచన చేశాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టన్నుఇసుకను రూ.600కు అమ్మితే, దాని ద్వారా దాదాపు రూ.10వేలకోట్లవరకు దోపిడీచేయొచ్చన్నా రు. జగన్ తన రెండేళ్లపాలనలో ఇసుకను అందుబాటులో లేకుండాచేసి, ఇళ్లుకట్టుకునేవారిని, కట్టే వారిని ఏడిపించాడ న్నారు. 
 
సంక్షేమాన్ని చంకనాకించిన ముఖ్యమంత్రి, రైతులు దళితులు, భవననిర్మాణకార్మికులను నిలువునా మోసగిం చాడన్నారు. రెండేళ్ల జగన్ పాలన శుష్కవాగ్ధానాలు, శూన్య పాలనకే పరిమితమైందన్నారు. ఇసుక వ్యవహారంలో మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేల జోక్యం ఎక్కువైందన్నా రు. ప్రభుత్వ ఇసుక దోపిడీని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని, తక్షణమే ముఖ్యమంత్రి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలన్నారు. దోచుకోవడానికి ఎన్ని  మార్గాలున్నాయో అన్నిమార్గాల తలుపులను ముఖ్యమంత్రి బార్లా తెరిచి ఉంచాడన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 10 వరకు..?