Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పౌరుల సమస్యలపై జగన్‌ సర్కార్‌ ప్రత్యేక దృష్టి

పౌరుల సమస్యలపై జగన్‌ సర్కార్‌ ప్రత్యేక దృష్టి
, ఆదివారం, 30 మే 2021 (11:54 IST)
ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం వైయస్‌.జగన్‌ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం స్పందన కార్యక్రమం. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే, అంటే 2019, జూలై 1న స్పందన కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. జిల్లాలలో వారం వారం కలెక్టర్లు స్వీకరించే ఫిర్యాదులు, సమస్యల వినతి పత్రాలపై రాష్ట్ర స్థాయిలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తున్నారు. 
 
అది బాధ్యతగా భావించాలి: 
పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్‌ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్దేశించారు. ఆ ట్రాకింగ్‌ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలని, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా పక్కన పడేసే పరిస్థితి ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. తన కార్యాలయ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రక్రియను పరిశీలించాలని, ఆ మేరకు సమీక్ష చేయాలని కూడా సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
 
కారణం చెప్పాలి: 
గ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా చెప్పగలగాలని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అలాగే పౌరుల నుంచి వచ్చే గ్రీవెన్స్‌ పరిష్కారానికి అర్హమైనదిగా గుర్తిస్తే దాన్ని తప్పకుండా పరిష్కరించాలని, నిర్ణీత సమయంలోగా గ్రీవెన్స్‌ పరిష్కారం కాకపోతే అది ఏస్థాయిలో నిల్చిపోయింది అన్నది కూడా చెప్పాలని ఆయన నిర్దేశించారు. ఆ మేరకు సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్‌ వెళ్లాలని ఆదేశించారు.
 
స్వయంగా పరిశీలన, సమీక్ష: 
ప్రతి 15 రోజులకు ఒకసారి స్పందన కార్యక్రమాన్ని, ప్రజా సమస్యల పరిష్కారం, అందుకు అధికారులు అనుసరిస్తున్న విధానాలను సమీక్షిస్తున్న సీఎం వైయస్‌.జగన్, ప్రజలు నివేదించిన వినతులపై నిర్ణీత సమయానికి పరిష్కారం చూపడం, నాణ్యమైన సేవలు అందించడంపై  ప్రత్యేక దృష్టి పెట్టారు.
 
సమస్యలు - పరిష్కారం: 
స్పందనలో మొత్తంగా 29,73,957 వినతులు రాగా, వచ్చిన  ఫిర్యాదుల్లో 98 శాతం పరిష్కారం అయ్యాయి. మరో 51,849 వినతులు పరిష్కారం దిశలో ఉన్నాయి.
 వచ్చిన గ్రీవెన్సెస్‌లో పౌర సరఫరాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలకు సంబంధించినవే 80 శాతం ఉన్నాయి.
 
స్పందన పోర్టల్‌: 
ఇక వినతలు పరిష్కారంలో జవాబుదారీతనం, నిర్ణీత సమయానికి పరిష్కరించడం నాణ్యతతో కూడిన సేవలు అందించడానికి మరింత పటిష్టంగా స్పందన పోర్టల్‌ రూపొందించారు. పోర్టల్‌ పనితీరుపై పటిష్టమైన పర్యవేక్షణ, విశ్లేషణ. ఇసుక మరియు మద్యానికి సంబంధించి అక్రమాల నివారణకు 14500 ప్రత్యేక కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనందయ్య శిష్యుడికి కరోనా పాజిటివ్.. మరో ఇద్దరికి కూడా..