Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 10 వరకు..?

ఏపీలో కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూన్ 10 వరకు..?
, సోమవారం, 31 మే 2021 (16:05 IST)
ఏపీలో కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజు రోజుకూ కేసులు తగ్గుతున్నప్పటికీ.. కరోనా కట్టడికి మరికొన్ని రోజులు కర్ఫ్యూని కఠినంగా అమలు చేయడమే మంచిదని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. ఏపీలో కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించిన సీఎం జగన్.. రాష్ట్రంలో ప్రస్తుత కేసులు.,. రికవరీ రేటు తదితర అంశాలపై చర్చించారు. గతంతో పోల్చుకుంటే కరోనా కంట్రోల్ అయినప్పటికే.. మరింత కఠినంగా ఉండాల్సిందే అని ఆయన అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. 
 
కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూన్ 10 వరకు కర్ఫ్యూను పెంచాలని అధికారులకు ఆదేశించారు. కర్ఫ్యూ సడలింపులపైనా ఈ సమావేశంలో చర్చించారు. అయితే ముఖ్యంగా కరోనా చైన్ తెగిపోవాలి అంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం జగన్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు అమలు చేస్తున్న సడలింపుల్లో ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు. 
 
మరో 10 రోజులు పాటు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్ర‌భుత్వం.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ అవసరాల నిమిత్తం స‌డ‌లింపులు ఉండ‌గా.. ఆ స‌మ‌యాన్ని కూడా య‌థాత‌థంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్యారీవేర్ సేఫ్-బయ్: ఒక్క బటన్ క్లిక్‌తో బాత్రూమ్ సంబంధిత అన్ని అవసరాలకు వన్-స్టాప్ పరిష్కారం