Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజమైన కోవిడ్ వారియర్స్ జర్నలిస్టులే : సునీల్ దియోదర్

Advertiesment
Journalist
, సోమవారం, 31 మే 2021 (12:10 IST)
కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులే నిజమైన కరోనా వారియర్స్ అని ఎపి బీజేపీ ఇంఛార్జి సునీల్ దియోదర్ ప్రశంసించారు.
 
 బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త నూతులపాటి బాల కోటేశ్వరరావు (బాల) ఆధ్వర్యంలో సేవా హి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం జర్నలిస్టులకు బియ్యం పంపిణీ చేశారు.
 
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి ఏపీ ఇంచార్జ్ పాల్గొన్న ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దియోదర్ మాట్లాడుతూ జర్నలిస్టులు కూడా నిజమైన కరోనా వారియర్స్ అని అన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడడం బాధాకరమన్నారు. 
 
బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎప్పుడు అండగా ఉంటుందని, వారి కొరకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకోసం ప్రత్యేక సంక్షేమ పథకం ఏర్పాటు చేశామని వారి కాళ్ళ మీద వారు నిలబడే వరకూ ఉచిత విద్యను అందిస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు.
 
పెరిగిన పెట్రోల్ ధరలపై స్పందిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాలైన గోవా, గుజరాత్ రాష్ట్రాలలో తక్కువ ధరకే పెట్రోల్ దొరుకుతుందని, మిగిలిన రాష్ట్రలు కూడా రాష్ట్ర ప్రభుత్వ టాక్స్ సర్వీస్ తగిస్తే ప్రజలపై భారం తగ్గుతుందని, జర్నలిస్టులకు చిన్న సాయంగా బీయం అందజేస్తామని వారికి ఎప్పుడు స్థానిక నాయకత్వం కూడా అండగా ఉంటుందని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం అధ్య‌క్షులు కాజ‌ కిర‌ణ్,కిసాన్ మోర్చ‌ అధ్య‌క్షులి శ్రీ రేగ‌ళ్ళ‌ ర‌ఘునాద్ రెడ్డి, కొండ‌ప‌ల్లి మున్సిపాలిటి అధ్య‌క్ష‌ కార్య‌ద‌ర్సులు, అద్దేప‌ల్లి ఆంజ‌నేయులు, బొర్రాప్ర‌వీణ్, న‌క్కా ర‌మేష్, ఇబ్ర‌హింప‌ట్నం పార్టి అధ్య‌క్షులు కాజాకిర‌ణ్, క్రిష్ణ‌మోహ‌న్, యుగంధ‌ర్, య‌స్.సి సెల్ ప‌ల్లె న‌రేష్ ద‌ర్స‌న‌పు స్వ‌తంత్ర‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజీరియాలో విద్యార్థుల కిడ్నాప్.. స్కూల్‌పై దాడి చేసి 200 మందిని..?