Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి

ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతి
, మంగళవారం, 1 జూన్ 2021 (11:04 IST)
SV Prasad
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఎస్వీ ప్రసాద్.. 1975 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి.
 
నెల్లూరు జిల్లా సబ్‌కలెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్‌, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు. 2010లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు సీఎస్‌గా పనిచేశారు.
 
తన కంటే 20మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులున్నా ఎస్వీ ప్రసాద్‌నే సీఎస్‌ పోస్టు వరించింది. పదేళ్లకు పైగా ముగ్గురు సీఎంల దగ్గర ఎస్వీ ప్రసాద్‌ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 
 
నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, చంద్రబాబు హయాంలో సీఎస్ గా పనిచేశారు. ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో అందరినీ ముందుండి నడిపే అధికారిగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబా రాందేవ్ వ్యాఖ్యలు.. బ్లాక్ డేని పాటిస్తున్న వైద్యులు