Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ పరంగా ఏపీ రాజధాని అమరావతే... : జీవీఎల్ నరసింహా రావు

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (10:14 IST)
తమ పార్టీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. అయితే, ఈ రాజధాని అంశంపై పోరాడుతున్న అమరావతి ప్రాంత రైతులకు హస్తినలో కంటే కోర్టులో పరిష్కారం లభించవచ్చని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాజధానిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ చెప్పిన సమాధానంలో పూర్తి స్పష్టత ఉందని, కానీ, విపక్ష నేతలే దానికి పెడర్థాలు తీస్తూ, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమేనని పునరుద్ఘాటించారు. 
 
ఏపీ రాజధానిపై కేంద్రం వైఖరి మారబోదని స్పష్టంచేశారు. అయితే, పార్టీపరంగా ఏపీ రాజధాని అమరావతేనని తాము రాజకీయ తీర్మానం చేశామని చెప్పారు. అమరావతి నుంచి రాజధానిని తీసేయాలని తమకేమీ కోరిక లేదని, కక్ష అంతకన్నా లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజకీయ కారణాలు అసలే లేవని, దీనిపై అపోహలు సృష్టించడం తప్ప మరొకటి కాదన్నారు. 
 
అయితే ఈ అంశానికి కోర్టులో పరిష్కారం లభించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కాబట్టి, రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం చెప్పిందని వివరించారు. ఈ వైఖరిని ప్రతిఘటించాలనుకుంటే ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments