వివేకానందరెడ్డి హత్యపై భరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (10:29 IST)
ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై కడప జిల్లా పులివెందులలో గోర్ల భరత్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్యకు ప్రత్యేక సూత్రధారుడు అల్లుడు నరరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని షాకింగ్ కామెంట్లు చేశారు. కేవలం ఆస్తి కోసమే వైఎస్ వివేకా హత్య జరిగిందని, సునీల్ యాదవ్ నేరుగా తనతోనే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించినట్టు భరత్ యాదవ్ పేర్కొన్నారు.
 
 
వివేకా సన్నిహితురాలు షమీంకు ఆస్తి చేరిపోతుందనే ఉద్దేశంతోనే వివేకా హత్య జరిగినట్లు తెలిపారు. హత్యకు వెల్లడించక పోవడానికి గల కారణం కేవలం ప్రాణభయం మాత్రమేనని అని.. మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలపై తనకు తెలిసిన విషయాలను మీడియాతో ఇవాళ చెప్పాల్సి వచ్చిందన్నారు. అయితే హత్యకు గల కారణాలను మొట్టమొదటగా సీబీఐకి అందించిన వ్యక్తి నేనేనని గోర్ల భరత్ యాదవ్ వెల్లడించారు.
 
కాగా  వివేకానందరెడ్డి 2019 మార్చి 14న అర్ధరాత్రి తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసు అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులుగా ఉన్న పలువురు ఆయన హత్యపై కీలక విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments