Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థి ద‌శ‌లోనే మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్పాలి: డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని

Advertiesment
martial arts
విజ‌య‌వాడ‌ , సోమవారం, 22 నవంబరు 2021 (10:13 IST)
విద్యార్థి ద‌శ‌లోనే పిల్ల‌ల‌కు మార్ష‌ల్ ఆర్ట్స్ నేరాల‌ని, పిల్లలు ప్ర‌యోజ‌కులు కావాలంటే, విద్య ఒక్క‌టే ఉంటే స‌రిపోద‌ని, చ‌దువుతో పాటు ఆట‌పాటలు కూడా చాలా ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కోడిపందాలు, జూదాల వైపు వెళ్లకుండా పిల్లలకు, యువతకు క్రీడలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
 
 
ఏలూరు పాత బస్టాండ్ కర్బలా మైదానంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 2వ స్టేట్ లెవెల్ మార్షల్ ఆర్ట్స్  చాంపియషిప్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. త‌మ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన మంత్రి ఆళ్ల నానికి అంతులేని ఆనందంతో విద్యార్థులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మార్షల్ ఆర్ట్స్, క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్ వంటి క్రీడలు నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలు కూడ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తే, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుందని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.
 
 
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా, చిన్నపిల్లలకు మార్షల్ ఆర్ట్స్, యువకులకు క్రికెట్ పోటీలు, వాలీబాల్ క్రీడలు నిర్వహించాల‌ని మంత్రి సూచించారు. నేటి తరం యువతకు గ్రామీణ క్రీడల‌పై సరైన అవగాహన కల్పించడం మంచి పరిణామమని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. పిల్లలలో మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూసి వారిని ప్రత్యేకంగా అభినందించి, రాష్ట్రస్థాయి నుంచి ప్రపంచ స్థాయి పోటీలకు పిల్లలు ఎదగాలని ఆకాంక్షించారు. 13 జిల్లాల నుంచి విచ్చేసిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ లను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు. 
 
 
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మంచేం మైబాబు, ఏలూరు డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ రావు, ఈడ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, స్మార్ట్ సిటీ చైర్మన్ బోద్దని అఖిలప్రియ, నగర అధ్యక్షులు బోద్దని శ్రీనివాస్,కార్పొరేటర్లు ఎర్రం శెట్టి సుమన్, కలవకోల్లు సాంబ, ఇలియాస్ పాషా, వైయస్సార్ సిపి నాయకులు ఎం ఆర్ డి బలరాం, కిలాడి దుర్గారావు, నేరుసు చిరంజీవి, రియాజ్, పొలిమేర హరి కృష్ణ, మట్ట రాజు, మాతర సురేష్ బాబు, సదానంద కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాసలీలల బాగోతం- అమరావతి దళిత జేఏసీ నేత చిలకా బసవయ్య అరెస్ట్