Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25న వెల్లడికానున్న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

25న వెల్లడికానున్న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు
, బుధవారం, 21 జులై 2021 (18:29 IST)
బక్రీద్ పండుగను పురస్కరించుకుని బుధవారం విడుదల కావాల్సిన పరీక్షా ఫలితాలను సీబీఎస్ఈ ఈ నెల 25వ తేదీకి వాయిదావేసింది. అలాగే, పదో తరగతి ఫలితాలను కూడా వెల్లడించలేదు. 
 
దీనిపై పరీక్షల కంట్రోల్ సన్యం భరద్వాజ్ స్పందిస్తూ, బక్రీద్ పండుగ కారణంగా గెజిట్‌లో సెలవు రోజు అనీ, కానీ బుధవారం సీబీఎస్ఈ అధికారులకు మాత్రం సెలవు లేదన్నారు. 12 వ తరగతి ఫలితాలను సిద్ధం చేసి విడుదల చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరీక్షా కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. 
 
అదేవిధంగా, సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలను ఖరారు చేసే చివరి తేదీని జూలై  25 సాయంత్రం 5కు పొడిగించింది. గడువు సమయంలోపు ఫలితాల వెల్లడి కోసం పాఠశాలలకు సహాయం చేయడానికి, సిబిఎస్ఇ ప్రాంతీయ కార్యాలయాలు వారి ప్రధాన కార్యాలయంలోని పరీక్షా విభాగం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని ఆయన తెలిపారు. 
 
2020లో 10వ తరగతి ఫలితం జూలై 15న ప్రకటించారు. గత సంవత్సరం, కరోనావైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకునే సమయానికే బోర్డు 10వ తరగతి కోసం చాలా పరీక్షలను నిర్వహించింది. అందువల్ల ఫలితాలను ప్రకటించగలిగారు. ఈసారి పరీక్షలు నిరవహించే పరిస్థితి లేకపోవడంతో పరీక్షలు జరగలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూగో జిల్లా పి.గన్నవరంలో కంటోన్మెంట్ జోన్లు.. కర్ఫ్యూ