Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీట్‌ పరీక్షల తేదీల ఖరారు.. జూలై 20 నుంచి..?

నీట్‌ పరీక్షల తేదీల ఖరారు.. జూలై 20 నుంచి..?
, సోమవారం, 12 జులై 2021 (20:19 IST)
ఇటీవల, మాజీ విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జేఈఈ మెయిన్ 2021 తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకు, జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. తాజాగా కోవిడ్‌-19 ప్రోటోకాల్స్‌ పాటిస్తూ సెప్టెంబర్‌ 12న నీట్‌ ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహించనున్నారు. మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఖరారు చేశారు.
 
విద్యార్థుల నుంచి దరఖాస్తులను జూన్‌-13 మంగళవారం సాయంత్రం నుంచి స్వీకరించనున్నారు. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కోవిడ్‌-19 దృష్ట్యా పరీక్షా నిర్వహించే నగరాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచినట్లు ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. దాంతో పాటుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు 12న నీట్ ప్రవేశ పరీక్ష - 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ