సంగం బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలో పూర్తి : మంత్రి మేకపాటి

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (11:26 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన సంగం బ్యారేజి నిర్మాణం పనులు గత ప్రభుత్వం శీతకన్ను వేసిందని, అతి త్వరలో నిర్మాణ పనులు పూర్తిచేసి సాగు తాగు నీరు అందిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. 
 
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డిలతో కలిసి సంగం బ్యారేజీ నిర్మాణ పనులను మంత్రులు గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు గురువారం పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ బ్యారేజీ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తిచేయడమే కాకుండా, పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సంగం, నెల్లూరు బ్యారేజీ నిర్మాణ పనులను సెప్టెంబరు అక్టోబరు లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ 1, ఫేస్ 2 పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బ్యారేజి నిర్మాణ పనులకు నిధులు సక్రమంగా కేటాయించనందున నిర్మాణం నత్తనడకన సాగిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే  నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: కెచ మాస్టర్ ఆధ్వర్యంలో కేరళలో మైసా యాక్షన్ షెడ్యూల్ పూర్తిచేసిన రష్మిక మందన్న

Trisha: సూర్య, త్రిష జంటగా నటించిన వీరభద్రుడు సెన్సార్ పూర్తి

RB Choudhary : సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత, నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం

ఐదు రోజుల్లో రూ. 5 కోట్ల గ్రాస్ దాటిన కలెక్ష‌న్స్ సాధించిన ధ‌నుష్ కర

Pooja Hegde: దళపతి విజయ్ గెలుపు ముందుగానే చెప్పిన పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలంటే ఈ గింజలు తినాలి

వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయి?

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

తర్వాతి కథనం
Show comments